వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, తెదేపా నేత చినరాజప్ప విమర్శించారు. విశాఖ ఎయిర్పోర్టు ఆపాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో భవనాల కూల్చివేతే లక్ష్యంగా వారానికో నిర్మాణాన్ని కూల్చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే సబ్బంహరి, శ్రీహర్ష, గీతం సంస్థలు, కాశీలకు చెందిన నిర్మాణాలను ఇప్పటి వరకు కూల్చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో తెదేపాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని.., రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పుష్కర స్నానాలు జరుగుతున్న తీరు దారుణం
తుంగభద్ర పుష్కర స్నానాలు జరుగుతున్న తీరు దారుణమని తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు. జగనన్న షవర్ బాత్ పేరిట 250 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం కనీసం రోడ్లు కూడా వేయలేదని దుయ్యబట్టారు.
రాజధాని పేరుతో విశాఖలో భూకుంభకోణాలు