'మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి' - మంత్రి నానిపై తెదేపా నేతల ఫైర్ వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి యనమల గురించి... మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. కొడాలి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
!['మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5096403-952-5096403-1574011323396.jpg)
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పట్ల తెదేపా నేతలు భగ్గుమన్నారు. మాజీమంత్రి యనమలను నిందించే స్థాయి కొడాలికి లేదని... తక్షణమే బేషరతుగా క్షమాపణాలు చెప్పాలని మాజీఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు డిమాండ్ చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి... ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని... తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక... రాష్ట్రాభివృద్ధి అధోగతి పాలైందని విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును అసభ్యపదజాలంతో సంబోంధిచడం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి : 'జగన్ మెప్పు కోసమే... కొడాలి నాని ఆరాటం'