ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే.. విజయసాయిని తీసుకురండి' - MP Vijayasai Reddy Strong Counter To Velagapudi Ramakrishna

వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​పై తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలపూడి రామకృష్ణబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎంపీ విజయసాయిరెడ్డిని తీసుకువచ్చి ప్రమాణం చేసి చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

mla gudivada amarnath
mla gudivada amarnath

By

Published : Dec 27, 2020, 4:41 PM IST

విశాఖలో ప్రమాణాల సవాళ్లతో రాజకీయ మాటల యుద్ధం జరుగుతోంది. వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్... వెలగపూడి రామకృష్ణబాబుపై చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుడివాడ అమర్​నాథ్​​కు రాజకీయ భవిష్యత్ కల్పించింది తెలుగుదేశం అనే విషయం మర్చిపోయారని విమర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డికి సవాలు చేస్తే... కింది స్థాయి నేతలు వచ్చి మాట్లాడటంలో అర్థం లేదన్నారు. ఆరోపణలు చేస్తున్న వైకాపా నేతలు ఎంపీ విజయసాయి రెడ్డిని తీసుకుని వచ్చి ప్రమాణం చేసి.. తమ చిత్తశుద్ధి ఏమిటో నిరూపించుకోవాలని వారు సవాల్ చేశారు.

వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​కు వ్యతిరేకంగా విశాఖలో తెదేపా నిరసన ర్యాలీ చేపట్టింది. ఎంవీపీ కాలనీలో వెలగపూడి కార్యాలయం నుంచి చేపట్టిన తెదేపా శ్రేణుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details