ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ భూములు అమ్మేయటం దారుణం.. ప్రజాఉద్యమాల ద్వారా అడ్డుకుంటాం: తెదేపా

విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకంగా సెజ్ ఏర్పాటు చేసి భూములను కేటాయిస్తే.. వాటిని ప్రభుత్వం అమ్మేయాలనుకోవటం దారుణమని తెదేపా నేతలు మండిపడ్డారు. మధురవాడ ఐటీ హిల్స్ వద్ద భూములు అమ్మవద్దంటూ నేతలు ఆందోళనకు దిగారు. దాదాపు 1500 కోట్ల విలువైన 90 ఎకరాల భూమిని.. జగన్‌ బినామీ కంపెనీకి 180 కోట్లకే అమ్మేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు.

ప్రభుత్వ భూములు అమ్మేయటం దారుణం
ప్రభుత్వ భూములు అమ్మేయటం దారుణం

By

Published : Apr 4, 2022, 4:17 PM IST

విశాఖలో భూములు అమ్మవద్దంటూ తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు. మధురవాడ ఐటీ హిల్స్ వద్ద నిర్వహించిన ఆందోళనలో.. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రి బండారు స్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు రూ.1500 కోట్ల విలువైన 90 ఎకరాల భూమిని.. జగన్‌ బినామీ కంపెనీకి 180 కోట్లకే అమ్మేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి సారథ్యంలో సాగుతున్న ఈ భూముల విక్రయాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా సెజ్ ఏర్పాటు చేసి భూములను కేటాయిస్తే.. వాటిని ప్రభుత్వం అమ్మేయాలనుకోవటం దారుణమని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను అడ్డుకునేందుకు.. ప్రజా ఉద్యమాల ద్వారా పోరాడతామని నేతలు స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూములు అమ్మేయటం దారుణం

ABOUT THE AUTHOR

...view details