పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యత్యాసం లేకుండా సీఎం అధికార దుర్వినియోగం చేస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. సీఎం విశాఖ పర్యటన కోసం ప్రైవేటు బడులకు సెలవు ప్రకటించి మరీ స్కూలు బస్సులు తరలించడమేంటని ప్రశ్నించారు. 31 స్కూళ్లు, 6 కళాశాలల బస్సులను సీఎం పర్యటనకు వాడతారా అని నిలదీశారు. ఏ సందర్భమూ లేకుండా సెలవులు ప్రకటిస్తే.. విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని నిలదీశారు. ఇప్పటికే 8 వేల పాఠశాలలను మూయించి.. విద్యావ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. రేపటి నుంచి సీఎం సభకు కుర్చీలు, బల్లలు అవసరమని అవి కూడా తరలిస్తారేమోనని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:Floods: గోదావరి ఉగ్రరూపం.. లంకగ్రామాల్ని చుట్టుముట్టిన వరద ప్రవాహం