ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం - తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

tdp-leader-palla-srinivasa-raos-initiation-was-stop-by-police
తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

By

Published : Feb 16, 2021, 4:14 AM IST

Updated : Feb 16, 2021, 5:46 AM IST

04:12 February 16

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరాహారదీక్షను.. గతరాత్రి పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాస్‌ను దీక్షా శిబిరం నుంచి బలవంతంగా కృషి ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. పల్లా దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖకు రానుండగా ఆ పర్యటనకు కొద్ది గంటల ముందే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. మొదట సాధారణ నిరాహార దీక్షకు కూర్చున్న పల్లా శ్రీనివాస్‌.. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం అనంతరం.. నిర్ణయం మార్చుకొని ఆమరణ దీక్షకు దిగారు.  ఫిబ్రవరి 10 నుంచి ఈ దీక్ష కొనసాగుతోంది. అటు.. పల్లా దీక్షకు మద్దతు తెలిపేందుకు నిన్న విశాఖకు వచ్చిన అమరావతి రైతులు.. రాత్రి ఒంటి గంట వరకూ దీక్షా శిబిరం వద్దే ఉన్నారు. జై అమరావతి- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు కూడా చేశారు.

Last Updated : Feb 16, 2021, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details