ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP Leader Palla : విశాఖ ఉక్కు కోసం.. పార్లమెంట్​లో ఎందుకు ప్రశ్నించట్లేదు?: తెదేపా నేత పల్లా - పల్లా శ్రీనివాస రావు న్యూస్

TDP Leader Palla Srinivas rao: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు పొరాడడంలేదని.. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిజంగా వ్యతిరేకిస్తే.. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా విక్రయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెదేపా నేత పల్లా
తెదేపా నేత పల్లా

By

Published : Dec 26, 2021, 9:51 PM IST

TDP Leader Palla Srinivas rao On Steel Plant Privatization: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీలు పార్లమెంట్​లో ఎందుకు పోరాటం చేయటంలేదని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు నిలదీశారు.

ఉక్కు కార్మికుల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతున్న వైకాపా.. గన్నవరం పోర్టులో 10.24 శాతం రాష్ట్ర వాటాను అదానీకి ఎందుకు అమ్మేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ద్వంద వైఖరిని విడనాడి.. చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నారు. స్టీల్​ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తెదేపా పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details