విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెదేపా ఖండించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి ఉన్నారని తెదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండటానికి హుద్ హుద్, కొవిడ్ ప్రభావం చూపించాయన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే.. ఉద్యమిస్తామని పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎంతోమంది నష్టపోతారు' - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తాజా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా చాలా మంది నష్టపోతారని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు.
tdp leader palla srinivas oppose privatization of steel plant