విశాఖ తెదేపా నేత సనపల పాండురంగారావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా గీతం ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ.. నేడు మృతి చెందారు. ఆయన ప్రస్తుతం విశాఖనగర తెదేపా అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయన అకస్మాత్తు మృతి పట్ల విశాఖ నేతలు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
కరోనాతో పోరాడుతూ మృతి చెందిన విశాఖనగర తెదేపా అధికార ప్రతినిధి సనపల పాండురంగారావుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.