విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్మిస్తున్న ఇంటర్ చేంజ్ రహదారి నిర్మాణంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మృతికి కారణమైన కాంట్రాక్టర్ పై కేసునమోదు చేసి అరెస్ట్ చేయాలని తెదేపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యకులు బుద్ద నాగ జగదీశ్వరరావు డిమాండ్ చేశారు.
అనకాపల్లి దుర్ఘటన: 'కాంట్రాక్టర్ ను అరెస్ట్ చేసి.. కోటి పరిహారం ఇవ్వండి' - anankapalli flyover accident
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఫ్లైవోవర్ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తెదేపా నేత బుద్ద నాగ జగదీశ్వరరావు డిమాండ్ చేశారు. మృతులకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.
కాంట్రాక్టర్ ను అరెస్ట్ చేయాలి
ఇదీ చదవండి:విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి
ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మృతులకు రూ. కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ పై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.