ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Harassment: ‘ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి నాని వేధిస్తున్నారు’.. పోలీసులకు తెదేపా మహిళా నాయకురాలు ఫిర్యాదు - వల్లభనేని వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెదేపా మహిళా నాయకురాలు

Harassment: ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిపై తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు వారి మనుషులతో సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన చెందారు.

tdp leader complained on ysrcp leaders over harassing her
ఎమ్మెల్యేలకు పోలీసులకు ఫిర్యాదు చేసిన తెదేపా మహిళా నాయకురాలు

By

Published : Jun 12, 2022, 9:26 AM IST

Harassment: ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని.. వారి మనుషులతో సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. రాచేటి రూతమ్మ అనే మహిళతో తనను తీవ్ర పదజాలంతో తిట్టిస్తూ ఆడియో సంభాషణ పంపారని పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని శనివారం హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా గన్నవరంలో ఆయన విగ్రహం కనపడకుండా ఫ్లెక్సీలు కట్టి, సభావేదిక ఏర్పాటు చేశారని, దీనిని బహిరంగంగా నిలదీయడంతో వంశీ, ఆయన అనుచరులు తనపై సామాజిక మాధ్యమాల ద్వారా దాడికి దిగారన్నారు. ఈ నెల 10న తనను అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ మాట్లాడిన ఆడియో సంభాషణ వాట్సప్‌ చేశారన్నారు.

గన్నవరానికి చెందిన రూతమ్మ ఈ సంభాషణ చేసినట్లుగా తమ పరిశీలనలో తేలిందన్నారు. వైకాపా అరాచకాలు ప్రశ్నిస్తున్నందుకే తనపై ఇలా దిగజారుడు రాజకీయం చేస్తున్నారంటూ ఆమె వాపోయారు. ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నామని ఎస్సై చెప్పారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details