ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ ప్రజలను బెదిరించి, అందినకాడికి దోచుకుంటున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందని.. అప్పడు విజయసాయి బాధితులెవరూ ప్రత్యేకంగా పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదన్నారు.
బాధితుల కోసం విశాఖలో ప్రత్యేకంగా ఒక ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విజయసాయి కారణంగా భూములు కోల్పోయిన వారికి తిరిగి అప్పగిస్తామన్నారు.