BANDARU ON YSRCP ILLEGAL MINING & LAND GRABBING: విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలంలో రూ. 100 కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని.. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని తెదేపా నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కోరారు. సబ్బవరం మండలంలో స్వయంగా ఎమ్మెల్యే ఆదీప్ రాజా మేనమామ వీఆర్వోగా ఉండడంతో అధికార దర్పం ప్రదర్శిస్తున్నారన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు సైతం భూ కబ్జాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీకి చెందిన కొందరు సబ్బవరం, పెందుర్తిలో 36 ప్రభుత్వ భూములు అక్రమించుకున్నారని బండారు వివరించారు. సబ్బవరం, పెందుర్తి తహసీల్దార్లపై విచారణ జరిపి.. వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.