ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయసాయి అండతోనే పెందుర్తిలో వైకాపా నేత భూకబ్జా: బండారు - Tdp leader Bandaru satyanarayana news

ప్రకాశం జిల్లాకు చెందిన వైకాపానేత సూర్యప్రకాశ్ రెడ్డి.. విశాఖ జిల్లాలో భూ కబ్జాకు పాల్పడుతున్నారని తెదేపా నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు. విజయసాయి అండతోనే దందా చేస్తున్నారని అన్నారు.

Tdp leader Bandaru satyanarayana comments On Vizag Lands
తెదేపా నేత బండారు సత్యనారాయణ

By

Published : Nov 24, 2020, 11:19 AM IST

ముఖ్యమంత్రి జగన్​ అనుచరులు విశాఖ భూములపై రాబందుల్లా వాలుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైకాపా నేత సూర్య ప్రకాశ్ రెడ్డి విశాఖ జిల్లాలో భూ కబ్జా చేశారనేది వాస్తవమని నొక్కి చెప్పారు. సూర్య ప్రకాశ్ రెడ్డితో తమ పార్టీకి సంబంధం లేదని స్థానిక వైకాపా నాయకులు చెబుతున్నది అవాస్తవమన్నారు.

సీఎం జగన్​తో సూర్యప్రకాశ్ రెడ్డి

సీఎం జగన్ కుటుంబంతో సూర్య ప్రకాశ్ రెడ్డి సన్నిహితంగా ఉన్న ఫొటోలు విడుదల చేసిన బండారు... ఎంపీ విజయ సాయి అండతోనే పెందుర్తి మండలంలో కబ్జాకు పాల్పడ్డారని బండారు ఆరోపించారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్... అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని బండారు దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details