సంక్షేమం పేరుతో విశాఖలో విజయసాయిరెడ్డి సంక్షోభం సృష్టిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. విశాఖ ప్రజలు విజయసాయిరెడ్డి భూకబ్జాలతో విలవిలలాడుతున్నారని ఆరోపించారు. అధికారం అండతో విశాఖ ప్రజలకు నరకం చూపిస్తున్నారని.. సుమారు 6వేల ఎకరాలకు పైగా భూ సేకరణ జరుగుతోందని విమర్శించారు. మాట వినని వారిని బెదిరిస్తున్నారని.. జగన్ రెడ్డి పాలనలో భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
కబ్జాలు చేస్తున్న విజయసాయిరెడ్డి.. ఎదుటి వారిపై నేరం మోపతూ 'దొంగే దొంగా' అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని మార్పు పేరుతో రెండేళ్లలో విశాఖ భూముల విలువ పెంచుకుని సామన్యుల నుంచి వేల ఎకరాలు లాక్కొని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎంపీగా రెండేళ్లలో విశాఖకు ఏం తెచ్చారో తెలపాలని ఓ ప్రకటనలో ఆయన్ను నిలదీశారు.