ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్​ జయంతి - ntr birth anniversary celebrations in visakha disrict

తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను విశాఖ జిల్లాలో తెదేపా నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్​ విగ్రహానికి తెదేపా నాయకులు నివాళులర్పించి పూలమాలలు వేశారు.

tdp founder ntr birth anniversary celebrations in visakha district
ఘనంగా ఎన్టీఆర్​ వేడుకలు

By

Published : May 28, 2020, 1:54 PM IST

తెదేపా వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను నర్సీపట్నం ఎన్టీఆర్​ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయన్​ పాల్గొన్నారు. ఎన్టీఆర్​ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళలర్పించి పూలమాల వేశారు.

చోడవరంలో ఎన్టీఅర్ జయంతి వేడుకలు తెదేపా నాయకులు ఘనంగా జరిపారు. గోవాడ చక్కెర కర్మాగారం పాలకవర్గ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు పట్టణంలోని పేద ప్రజలకు కాయగూరలు, నూనె, కోడిగుడ్లు, సబ్బులు అందజేశారు.

పాయకరావుపేట నియోజకవర్గంలో తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్​ జయంతి వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాయకరావుపేటలో మజ్జిగ పంపిణీ, అన్నదానాలు వంటి కార్యక్రమాలు చేపట్టారు.

ఇదీ చదవండి:

ఎన్టీఆర్ కలలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు: బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details