విశాఖ జిల్లాలో భూకబ్జాలను ప్రోత్సహిస్తూ, అధికారులను బెదిరించి పని చేయించుకుంటున్న వైకాపా నేతల తీరుపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలంలో ఉన్న చెరువు భూమిని రైతుల నుంచి మ్యుటేషన్ చేయడానికి ఎంపీ విజయసాయిరెడ్డి పలుమార్లు తహసీల్దారుకి ఫోన్లు చేసిన రికార్డులను బండారు బయటపెట్టారు.
అధికారులను బెదిరించి భూ రికార్డులు మారుస్తున్నారు: బండారు
విశాఖ జిల్లాలో వైకాపా నేతలు భూ దందాలకు తెరలేపారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రస్థాయిలో ఆరోపించారు. పెందుర్తి మండలంలో ఉన్న చెరువు భూమిని మ్యుటేషన్ చేయడానికి తహసీల్దారుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి ఉందన్నారు. అధికారులను ఒత్తిడి చేసి భూ రికార్డులు మార్పు చేస్తున్నారని ఆక్షేపించారు.
bandaru satyanaraya murthi
ఉపాధి హామీ కింద చేసిన చెరువు పనుల వివరాలను ఆయన వెల్లడించారు. ఇప్పుడు హఠాత్తుగా చెరువు భూమి రికార్డులు మార్పు చేశారని ఆరోపించారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. అధికార పార్టీ అండదండలతో ప్రజాప్రతినిధుల అనుచరులు జిల్లాలో ఈ తరహాలో పలు భూదందాలకు పాల్పడుతున్నారన్నారు. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా బయటపెట్టి ప్రజల ముందుంచుతామని బండారు సత్యనారాయణ వివరించారు.
ఇదీ చదవండి :పోలవరం వద్ద వాజ్పేయి విగ్రహం పెట్టాలి: సోము వీర్రాజు