ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా నినాదం' - తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వార్తలు

రాష్ట్రానికి ఒకే రాజధాని కావాలని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. కావాలంటే విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు రావాలని సూచించారు.

tdp ex minister ayyana patrudu
ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా నినాదం

By

Published : Feb 8, 2020, 12:59 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని... విశాఖ నుంచి లూలూ, అదానీ కంపెనీలు పారిపోయాయని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విశాఖలో దుయ్యబట్టారు. సీఎం జగన్‌ అసెంబ్లీకి దొడ్డిదారిన... కోర్టుకు మాత్రం కాన్వాయ్‌లో రాజమార్గంలో వెళ్తారని ఎద్దేవా చేశారు.

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా నినాదం

ఇప్పుడు 3 రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికిన మంత్రి బొత్సకు.. గతంలో మంత్రిగా పని చేసినప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి నుంచి మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణుల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details