సింహాద్రి అప్పన్నను విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. రెండు నెలల పాటు రుషికేశ్‌లో దీక్షకు వెళ్లిన ఆయన.. విశాఖ చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన స్వామికి.. అధికారులు, స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాత్మానంద సరస్వతి ఈ నెల 27 నుండి మెదలు 58 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికే ఈ యాత్ర చేస్తున్నారని స్వామిజీ అన్నారు. శారదాపీఠంలో సెప్టెంబరు 29 నుంచి దేవీ నవరాత్రి మహోత్సవాలు చేస్తున్నామన్నారు.
సింహాద్రి అప్పన్న ఆలయానికి స్వరూపానందేంద్ర సరస్వతి
రెండు నెలల పాటు రుషికేశ్‌లో దీక్షను ముగించుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ చేరుకున్నారు. సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదాపీఠంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి