ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Governor: గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​కు​ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానం - స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి

AP Governor: శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్ను పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానించారు.

గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్
గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్

By

Published : Dec 21, 2021, 7:49 PM IST

AP Governor: విశాఖ పట్నం జిల్లాలోని శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ను పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానించారు. విజయవాడ రాజ్​ భవన్​కు వచ్చిన సరస్వతీ స్వామి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు వరకు నిర్వహించే పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనాలంటూ ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు.

శ్రీ శారదాపీఠం ఆదిశంకరాచార్య సాంప్రదాయ అద్వైత పీఠంగా విలసిల్లుతోందని, సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించే మహత్తర కార్యం చేపడతున్నట్లు పీఠం ఉత్తరాధికారి వివరించారు. భారతీయ తత్వాన్ని, భారతీయ సత్వాన్ని నేల నలుచెరగులా ప్రబోధం చేసే గొప్ప కార్యాన్ని పీఠం నిర్వహిస్తోందని, వార్షిక మహోత్సవ వేడుకకు సకుటుంబ సమేతంగా విచ్చేసి రాజ శ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి గవర్నర్ హరిచందన్ కు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నర్​ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్​పీ సిసొడియా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:CM Jagan Birthday Celebrations in Puttur: పుత్తూరులో జగన్ బర్త్​ డే వేడుకలు.. ఎమ్మెల్యే రోజాపై విమర్శలు!

ABOUT THE AUTHOR

...view details