ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంప్రదాయబ్ధంగా స్వాతి నక్షత్ర పూజలు - సింహాచలంలో స్వాతి నక్షత్ర హోమం తాజా వార్తలు

విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయంలో స్వామి వారి నామ నక్షత్రమైన స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ నెలలో ఒక్కరోజే ఈ పూజలు జరుపుతారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి లేకపోవడం వల్ల వీరు ఆన్​లైన్​లో పేర్లు నమోదు చేసుకుని పూజలో పాలుపంచుకున్నారు.

swati nakshatra homam in simhachalam
సింహాచలం సన్నిధిలో స్వాతి నక్షత్ర హోమం

By

Published : Aug 25, 2020, 8:41 AM IST

సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృశింహస్వామి వారి ఆవిర్భావ తార.. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం సింహగిరిపై సుదర్శన నృసింహ హోమం, పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు, వేదపండితులు ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో చక్రపెరుమాళ్​ స్వామిని అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ విశేష అర్చనలు, యజ్ఞం నిర్వహించారు. పవిత్ర జలాలతో బేడామండపం ప్రదక్షిణ చేశారు. పూర్ణాహుతితో యజ్ఞ పరిసమాప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details