కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వానికి అనుగుణంగా మార్చి 16 నుండి 31 వరకు జరిగే స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాల్లో ప్రారంభమైంది. ప్లాంట్, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు, టౌన్షిప్, గనులు, మార్కెటింగ్ ఆఫీసులు, స్టాక్ యార్డులు, ప్రాజెక్ట్ ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలో కార్యక్రమం నిర్వహణకు శ్రీకారం చుట్టారు.
ఉద్యోగులు, విద్యార్థులు భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్స్ విభాగానికి చెందిన సిబ్బంది చేత ఆ విభాగాధిపతి వర్మ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.