ఎన్టీఆర్ భవన్లో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి తెదేపా నేతలు నివాళులర్పించారు. వివేకానందుడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్బాబు, గురజాల మాల్యాద్రి, కిలారి నాగశ్రవణ్, తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, వల్లూరు కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద 158వ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ నిర్వాహకులు పేదలకు చీరలు పంపిణీ చేశారు. హైందవ మతం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత స్వామి వివేకానందుడికే దక్కుతుందన్నారు. హిందూ మత ప్రచారం కోసం ప్రపంచ దేశాలు పర్యటించిన మహా యోగిగా వివేకానందను అభివర్ణించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట జనరల్ పాఠశాలలో.. స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. సామాజిక సమరస్యత సమితి ఆధ్వర్యంలో వివేకనందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి పాటలు పాడారు.