ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఘనంగా స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు - స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు తాజా వార్తలు

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ పీఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీస్సులు పొందారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు
ఘనంగా స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు

By

Published : Nov 18, 2020, 7:18 PM IST

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర జన్మదినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి తన గురువులు స్వరూపానందేంద్రకు అభ్యంగన స్నానం చేయించారు. అనంతరం స్వామీజీ గోపూజ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. స్వరూపానందేంద్ర తన అనుష్ఠాన దైవం సుబ్రమణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఆయుష్య హోమం, ఆవహంతీ హోమం వేదోక్తంగా జరిగాయి.

స్వామిజీ ఆశీస్సులు పొందిన మంత్రి అవంతి

శారదా పీఠాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించి స్వామీజీ ఆశీస్సులు పొందారు. అనంతరం పీఠం ప్రాంగణంలోని శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details