ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత' - visakha port latest news

స్వచ్ఛభారత్ వాతావరణాన్ని మెరుగుపరుస్తుందని విశాఖపట్నం పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహన్ రావు అన్నారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్​లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విశాఖ పోర్టులో 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

swachha bharat program in vsakha port
'పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత'

By

Published : Sep 16, 2020, 8:47 PM IST

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని.. విశాఖపట్నం పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహన్ రావు పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ జరిగిన సమయంలోనే కాకుండా.. ఏడాది పొడవునా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. డాక్ యార్డ్ ఈ క్యూ బెర్త్​లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో రామ్మోహన్ రావు పాల్గొన్నారు. పోర్టు ఉన్నతాధికారులు, ఉద్యోగుల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ కార్యదర్శి, ఉద్యోగులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details