మహారాణిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాశ్రావుపేటకు చెందిన తుమ్మల రమేష్‌కుమార్ (54) శనివారం కొవిడ్ లక్షణాలతో ఓ ఆసుపత్రిలో చేరారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఈ విషయాన్ని బంధువులు రమేష్‌కుమార్ కుటుంబసభ్యులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. కానీ సాయంత్రానికి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో భార్య తుమ్మల శివలక్ష్మి (40), కుమార్తెలు దర్శిని (19), శాలిని (12) మనస్తాపానికి గురై శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని బంధువులు హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని.. 24 గంటలు గడిస్తేకానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు.
శానిటైజర్ తాగి తల్లీకుమార్తెల ఆత్మహత్యాయత్నం - Suicide attempt by mother-daughter latest news
విశాఖ మహారాణిపేటలో దారుణం జరిగింది. కరోనాతో భర్త మృతిచెందగా.. మనస్తాపంతో తల్లి, కూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శానిటైజర్ తాగి తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖ కేజీహెచ్‌లో శివలక్ష్మి(40), దర్శిని(19), షాలిని(12) చికిత్స పొందుతున్నారు.
శానిటైజర్ తాగి తల్లీకుమార్తెల ఆత్మహత్యాయత్నం