హైకోర్టు ఆదేశాలతో విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యాలయం నుంచి వైద్యుడు సుధాకర్ డిశ్చార్జ్ అయ్యారు. కోర్టు తీర్పుల కాపీలను ఆస్పత్రి అధికారులకు అందించిన సుధాకర్ తల్లి కావేరి బాయి, బంధువు విజయ్‌కుమార్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితలు ఆయన్ను బయటకు తీసుకువచ్చారు. సుధాకర్‌కు కొన్నాళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించనున్నట్లు వంగలపూడి అనిత తెలిపారు.
వైద్యుడు సుధాకర్ గత నెల 16న ప్రభుత్వ మానసిక వైద్యాలయంలో పోలీసులు చేర్చారు. కాగా తన కుమారుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడో తెలపాలంటూ సుధాకర్ తల్లి హైకోర్టులో గురువారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. సుధాకర్‌ను డిశ్చార్జ్ చెయ్యాలని ఆదేశించింది.