విశాఖలో ఘనంగా సబ్ మెరైన్ దినోత్సవం - latest news on sub marine day
విశాఖలో సబ్ మెరైన్ దినోత్సవం ఘనంగా జరగింది. ఐఎన్ఎస్ వీరబాహులో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఆడ్మిరల్ కాళిదాసు శ్రీనివాస్ అమరులైన సబ్ మెరైన్ నావికులకు నివాళులు అర్పించారు
![విశాఖలో ఘనంగా సబ్ మెరైన్ దినోత్సవం sub marine day in vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5313296-207-5313296-1575862283765.jpg)
విశాఖలో ఘనంగా సబ్ మెరైన్ దినోత్సవం
జలాంతర్గామి 52వ దినోత్సవం విశాఖ తూర్పు నౌకాదళంలో ఘనంగా జరిగింది. ఐఎన్ఎస్ వీరబాహులో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఆడ్మిరల్ కాళిదాసు శ్రీనివాస్ అమరులైన సబ్ మెరైన్ నావికులకు నివాళులు అర్పించారు. సాయుధులైన 50 మంది నావికుల బృందం గౌరవ వందనం సమర్పించింది. 1967 డిసెంబర్ 8న భారత నౌకా దళంలో జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్.కల్వరిని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి సబ్‌మెరైన్ దినోత్సవం జరుపుతున్నారు.