ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పుల్వామా వీర జవాన్లకు ఘన నివాళి - students tribute to the Pulwama soldiers in hindupuram

పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవానులకు రాష్ట్రంలోని పలు జిల్లాలో విద్యార్ఖులు, నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. యావత్ దేశం జవాన్ల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.

students tributed to the Pulwama soldiers
పుల్వామా వీర జవానులకు ఘన నివాళి

By

Published : Feb 14, 2020, 2:07 PM IST

అనంతపురం జిల్లాలో..
పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు హిందూపురంలో విద్యార్థులు నివాళులర్పించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొన్నారు.

హిందూపురంలో వీర జవానులకు ఘన నివాళి

విశాఖ జిల్లాలో..

పుల్వామా దాడి ఘటనలో అమరులైన వీర జవాన్లకు భారతీయ జనతా యువమోర్చా విశాఖలో నివాళులర్పించింది. యావత్ భారతావని...సైనికులకు అండగా ఉండాలని భారతీయ యువ మోర్చా కోరింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వీర సైనికులను స్మరిస్తూ యువ మోర్చా కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

విశాఖలో వీర జవానులకు ఘన నివాళి

కర్నూలు జిల్లాలో...

పుల్వమా ఘటనలో అమరులైన జవాన్లకు కర్నూలులో విద్యార్థులు నివాళులర్పించారు. జవాన్లకు శ్రద్ధాంజలిగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు.

కర్నూలులో వీర జవానులకు ఘన నివాళి

ఇదీచూడండి.'ప్రేమికుల రోజును ఛీ కొట్టు అమర జవాన్లకు జై కొట్టు'

ABOUT THE AUTHOR

...view details