రెండో తరగతి నుంచి 8వ తరగతి వరకు "బెస్ట్ అవైలబుల్ స్కూల్స్" పథకాన్ని అమలు చేయాలని కోరుతూ... విశాఖలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
‘బెస్ట్ అవైలబుల్’కు మంగళం...విద్యార్థులు నిరసన - visakha latest news
ప్రభుత్వం పాత జీవోనే కొనసాగిస్తూ...2 తరగతి నుంచి 8 తరగతి వరకు "బెస్ట్ అవైలబుల్ స్కూల్స్" పథకాన్ని అమలు చేయాలని కోరుతూ...విశాఖలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు.
![‘బెస్ట్ అవైలబుల్’కు మంగళం...విద్యార్థులు నిరసన students protest rally in Visakhapatnam demanding implementation of the "Best Available Schools" scheme.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9055274-1064-9055274-1601886050025.jpg)
ప్రభుత్వం పాత జీవోను రద్దు చేయాలని విద్యార్థుల నిరసన
ఇప్పటి వరకు 1 నుంచి పదో తరగతి వరకు అమలయ్యే ఈ పథకాన్ని.. 9, 10 తరగతులకు మాత్రమే వర్తింపచేస్తూ ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ జగదాంబ కూడళ్లలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విద్యార్థుల సంఘం, అఖిల భారత విద్యార్థుల సంఘం సంయుక్తంగా ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని... ప్రభుత్వం పాత జీవోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.