Students Letter to Principal for watching PUSHPA: సొంతపని మీద సెలవు కావాలని విద్యార్థులు టీచర్లను అడగాలంటే గతంలో గజగజా వణికిపోయేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు కారణాలు మారాయి. సొంత పని కాదు సినిమా చూసే పని మీద సెలవు కావాలని ఏకంగా ప్రధానోపాధ్యాయునికే లేఖ రాశారా కళాశాల విద్యార్థులు. అంతేనా ప్రిన్సిపల్ కి సైతం అదిరిపోయే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారా లెటర్ లో. విశాఖలో ఇంటర్ విద్యార్థులు రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది.
లేఖలో ఏమి రాశారంటే..
ఈ నెల 17న పుష్ప సినిమా రిలీజ్ అయింది. దానికి ముందు రోజు ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడికి లేఖ రాశారు. తర్వాతి రోజు కాలేజీకి సెలవు ప్రకటించాలని కోరారు. సెలవు ప్రకటించకున్నా.. మేం రాకపోవడం మాత్రం పక్కా అని, ఇంటికి మెసేజ్‌లు పంపొద్దని, కాల్స్ చేయొద్దని కోరారు. అందుకే సెలవు ఇవ్వాలని కోరుతూ.... చివర్లో 'తగ్గేదే లే...!' అని రాశారు. కొసమెరుపుగా.... ప్రిన్సిపల్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఓ అదనపు టిక్కెట్ ఉందని... కావాలంటే జాయిన్ అవ్వొచ్చని ఆయనను ఆహ్వానించారు. మరి ఆ తర్వాతి రోజు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ సినిమాకు వెళ్లారో లేదో ...వారికీ...ఆ థియేటర్‌కే ఎరుక..!
పుష్ప సినిమా చూసేందుకు ప్రిన్సిపల్ కు కళాశాల విద్యార్థుల లేఖ ఇదీ చదవండి : VISAKHA AGENCY BEAUTY: మన్యంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వంజంగికి పర్యాటకుల తాకిడి