ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏయూలో రగిలిపోతున్న విద్యార్థులు...4 రోజులుగా నిరసనలు - ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వ విద్యాలయం అధికారుల తీరుపై విద్యార్థిలోకం రగిలిపోతోంది. పెంచిన ఫీజులను తగ్గించాలని కోరుతూ నాలుగు రోజులుగా నిరసన తెలియజేస్తున్నా విశ్వ విద్యాలయం ఉపకులపతి స్పందించకపోవడం పట్ల వారు నిరసన తెలియజేస్తూ మెయిన్‌ గేటు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

Students have been protesting at AU for four days
Students have been protesting at AU for four days

By

Published : Feb 1, 2020, 5:16 PM IST

ఏయూలో రగిలిపోతున్న విద్యార్థులు...4 రోజులుగా నిరసనలు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులుగా విద్యార్థులు నిరసన చేస్తున్నారు. అయినప్పటికీ వీసీ స్పందించకపోవటంపై మండిపడుతున్నారు. సెమిస్టర్‌, మెస్‌, విద్యుత్‌ ఛార్జీలను అనూహ్యంగా పెంచారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెమిస్టర్‌ ఫీజును 800 రూపాయల నుంచి 12 వందలకు పెంచారని, విద్యుత్‌ ఛార్జీని 300 రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. దీనివల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు విశ్వ విద్యాలయానికి అందించేదని.... ప్రస్తుత ప్రభుత్వం 225 కోట్ల రూపాయలనే మంజూరు చేసిందని తెలిపారు. మిగిలిన నిధులను ఛార్జీల రూపంలో తమ నుంచి వసూలు చేయాలని విశ్వ విద్యాలయం యాజమాన్యం యత్నిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details