ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల హర్షం.. ఇందుకేనట..? - visakha Steel plant Latest News

స్టీల్ ప్లాంట్​ను కేంద్రం ప్రైవేట్​పరం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు కార్మిక సంఘాలు, నేతలు హర్షం ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తగ్గే వరకు పోరాటం ఆగదని కార్మిక నేతలు స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల హర్షం
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల హర్షం

By

Published : May 20, 2021, 8:56 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్​ను కేంద్రం ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు కార్మిక సంఘాలు, నేతలు హర్షం ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్​కు కృతజ్ఞతలు చెప్పారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఈ నెల 22కు వందరోజులు అవుతున్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శుభసూచకమని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తగ్గే వరకు పోరాటం ఆగదని కార్మిక నేతలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకులు: చిరంజీవి

ABOUT THE AUTHOR

...view details