ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అందరికీ 8 శాతం... విశాఖ ఉక్కుకు 14 శాతం వడ్డీ' - ఉక్కు పరిశ్రమ లాభనష్టాలపై అఖిలపక్ష కమిటీ కన్వీనర్ అయోధ్యరాం వ్యాఖ్యలు

ఇతరులకు 8 శాతం చొప్పున బ్యాంక్​లు రుణాలు ఇస్తూ.. విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి 14 శాతం వసూలు చేస్తున్నట్లు అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరాం ఆరోపించారు. కేంద్రం రూ. 5 వేల కోట్లు పెట్టుబడిపెట్టి.. రూ. 43 వేల కోట్లు పన్నలు రూపంలో వసూలు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

visakha steel plant unions press meet, ayodhyaram allegations on center about steel plant issue
విశాఖ ఉక్కు కార్మిక సంఘాల మీడియా సమావేశం, కేంద్రంపై అయోధ్యరాం ఆరోపణలు

By

Published : Apr 1, 2021, 7:58 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందంటూ.. కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరాం మండిపడ్డారు. స్ట్రేటజిక్ సేల్ చేస్తామని చెప్పడంపై మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్​లో అందరికీ 8 శాతం చొప్పున రుణాలు ఇస్తున్న బ్యాంక్​లు.. కర్మాగారం నుంచి 14 శాతం వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. గత ఆర్థిక ఏడాదిలో రూ. 1,500 కోట్లు వడ్డీ చెల్లించినట్లు తెలిపారు.

సొంత గనులు ఇచ్చి వుంటే రూ. 3 వేల కోట్లు లాభాలు వచ్చేవని అయోధ్యరాం అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో కేంద్రం రూ. 5 వేల కోట్ల పెట్టుబడి పెట్టి.. రూ. 43 వేల కోట్లు పన్నుల రూపంలో తిరిగి తీసుకుందని ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 4న ఆర్కే బీచ్​లో వాక్.. 18న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్రం దిగి వచ్చి 'స్ట్రేటజిక్ సేల్' నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details