విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... 170 రోజులుగా కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు కేంద్రం స్పందించకపోవటంతో... తాడోపేడో తేల్చుకోవటమే లక్ష్యంగా ఉక్కు ఉద్యమ పోరాట సమితి అడుగులు వేసింది. పార్లమెంట్ ఉభయ సభలు జరుగుతున్న సమాయంలోనే దిల్లీలో ఉద్యమవాణి వినిపించాలని నిర్ణయించారు. నేడు జంతర్‌మంతర్ వద్ద... రేపు ఆంధ్రభవన్‌లో మహానిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నిన్న విశాఖ నుంచి బయలుదేరి దిల్లీకి చేరుకున్న ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట సమితి నేతలు, కార్మికులు... దేశరాజధాని వీధుల్లో ఉక్కు నినాదాలు మారుమోగించాలని నిర్ణయించుకున్నారు.
అన్ని వర్గాల సంఘీభావం
ఉక్కు ఉద్యమానికి వైకాపా, తెలుగుదేశం, వామపక్షాలు సహా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. దిల్లీలో కార్మికులు చేయబోయే ఉద్యమంలోనూ పాల్గొనేందుకు పలుపార్టీల నేతలు రాబోతున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పలు పార్టీలకు చెందిన నేతలు ఉక్కు ఉద్యమంపై గళాన్ని వినిపిస్తారని వెల్లడించారు. పార్లమెంట్, కోర్టులో ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా కేంద్రం ప్రకటన చేస్తోందని తెలిపారు. ఇకపై పోరాటాన్ని ఉద్యమం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు.
దిల్లీకి పయానం