విశాఖ ఉక్కు పోరాటానికి ఏడాది పూర్తైన సందర్భంగా కార్మికులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. జైల్ భరో కార్యక్రమం చేపట్టి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. కూర్మన్నపాలెం ఆర్చి నుంచి గాజువాక వరకు కార్మికుల ర్యాలీ చేపట్టగా.. మధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
విశాఖ ఉక్కు కార్మికుల ‘జైల్ భరో’.. కార్మికుల అరెస్ట్ తగ్గేదేలే.. కేంద్రమే తగ్గాలి..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి.. వార్షిక పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ కార్మికులు జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. కూర్మన్నపాలెం ఆర్చి వద్ద నుంచి గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి స్పష్టం చేసింది. కార్మికుల నిరసనలో పాల్గొన్న సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి వారికి సంఘీభావం ప్రకటించారు.
ఇదీ చదవండి:ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి కార్యాలయం?