విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, నిర్వాసితులు ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం ఒక ఎత్తైతే.. ఇకపై జరగబోయేది మరోఎత్తని ఉద్యమ నేతలు అంటున్నారు. ఈ నెలలో మరిన్ని కీలక కార్యక్రమాలు జరుగుతాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
కొత్త కార్యాచరణతో ఉద్యమానికి సిద్ధమౌతున్న కార్మిక సంఘాలు
విశాఖ ఉద్యమాన్ని రోజురోజుకూ ఉద్ధృతం చేసేవిధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఉద్యమ నేతలు చెబుతున్నారు. ఈ నెలలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాల వివరాలను వారు తెలియజేశారు.
కొత్త కార్యాచరణతో ఉద్యమానికి సిద్ధమౌతున్న కార్మిక సంఘాలు
కూర్మన్నపాలెంలో నిరసన జరుపుతూనే.. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర రిలే నిరహార దీక్షలు మొదలు పెడుతామన్నారు. అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల నేతృత్వంలో ఈ నిరసన దీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 4న సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో బీచ్లో పరుగు.. 18న కార్మిక కర్షకులతో మహా సభ నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నామన్నారు.
ఇదీ చదవండి:'ఎవరి పర్యవేక్షణలో సరుకు విక్రయిస్తే బాగుంటుందో చెప్పండి'