Visakha Steel Plant: భాజపా ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటుకు కేవలం రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టి.. రూపాయి కూడా ఇవ్వలేదని స్టీల్‌ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు అయోధ్యరామ్ అన్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.5 వేల కోట్లు పన్నులే కడుతున్నామని వాపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షకు రేపటికి 400 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో... ఈనెల 28న విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు.
విశాఖ బంద్‌కు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి పిలుపు...ఎప్పుడంటే..? - విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేతల పోరాటం
Visakha Steel Plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షకు రేపటికి 400 రోజులు పూర్తవుతున్న సందర్భంగా.. ఈనెల 28న విశాఖ బంద్‌కు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నేతలు పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతివ్వాలని ప్రజలు, రాజకీయ పార్టీలను కోరారు. వంద మంది ఎంపీల సంతకాలతో దిల్లీ వెళ్లి పోరాడతామని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను కొనసాగించే వరకు ఉద్యమిస్తామని వెల్లడించారు.
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి
అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని కార్మికసంఘ నేతలు కోరారు. వంద మంది ఎంపీల సంతకాలతో దిల్లీ వెళ్లి పోరాడతామని తెలిపారు. మరోవైపు ఉద్యమ సమయంలో ఎన్నికలు వద్దని చెప్పారు. ఈనెల 23న గుర్తింపు సంఘ ఎన్నికలపై కలెక్టర్ నిర్ణయం వస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి:
Indian naval maneuvers : భారత నౌకదళ విన్యాసాలను విడుదల చేసిన నేవి