ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం చెప్పే వరకు ఇళ్లకు వెళ్లకండి' - ఆర్​.ఆర్​.వెంకటాపురంలో పరిస్థి వార్తలు

ఎల్​జీ పాలిమర్స్​ పరిశ్రమ వద్ద సాధారణ పరిస్థితి నెలకుంటోందని మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తెలిపారు. అయితే ప్రభుత్వం చెప్పే వరకు పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇళ్లకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు దుర్ఘటనపై నివేదిక ఇవ్వాలని దక్షిణకొరియాలోని కంపెనీ ప్రతినిధులను ఆదేశించామని చెప్పారు.

ap ministers
ap ministers

By

Published : May 10, 2020, 7:50 PM IST

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. పరిశ్రమ వద్ద 82.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని తెలిపారు. అయితే మరో 24 గంటలు పరిసర గ్రామ ప్రజలు శిబిరాల్లో ఉండాలని ఆయన కోరారు. కేజీహెచ్‌ నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తులు కూడా శిబిరాల్లో ఉండాలని... అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. విశాఖలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్​తో సహా ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ కొరియాలోని ఎల్​జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారని కన్నబాబు వెల్లడించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించామని చెప్పారు. ప్రజలు, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నివేదిక ఇవ్వాలని కోరామన్నారు.

ప్రభుత్వం ప్రకటించే వరకు ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ పరిసరాల్లోని గ్రామాల ప్రజలు ఇళ్లకు వెళ్లవద్దని మంత్రి అవంతి సూచించారు. ఆయా గ్రామాల్లో నిపుణుల బృందం పర్యటించిందన్న మంత్రి.... వారి సూచనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details