విశాఖ ఫార్మా సిటీలో కొన్న 42 ఎకరాల ఒప్పందం రద్దుపై ఆంధ్రా షుగర్స్ హైకోర్టును ఆశ్రయించింది. భూమి అభివృద్ధి చేయలేదని సేల్‌డీడ్, ఒప్పందం రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఉత్తర్వులివ్వటాన్ని సవాల్ చేసింది. ఆంధ్రా షుగర్స్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జంధ్యాల రవిశంకర్..ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఏపీఐఐసీ, రాంకీ, ఆంధ్రా షుగర్స్ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. భూమిలోకి బ్యాక్‌వాటర్ రావటంతోపాటు ఆంధ్రా షుగర్స్‌కు రాంకీ సహకారం లేదని తెలిపారు. భూమి అభివృద్ధి చేయలేదని..సేల్‌డీడ్‌ను ఎలా రద్దు చేస్తారని వాదించారు. ఏపీఐఐసీ ఉత్తర్వులు.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఒప్పందం రద్దుపై స్టేటస్ కో విధించింది.
HC: ఆంధ్రా షుగర్స్ కొన్న 42 ఎకరాల ఒప్పందం రద్దుపై హైకోర్టు స్టేటస్ కో - ఆంధ్రా షుగర్స్ కొన్న 42 ఎకరాల ఒప్పందం రద్దుపై స్టేటస్ కో వార్తలు
విశాఖ ఫార్మా సిటీలో ఆంధ్రా షుగర్స్ కొన్న 42 ఎకరాల ఒప్పందం రద్దుపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. భూమి అభివృద్ధి చేయలేదని సేల్‌డీడ్, ఒప్పందం రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఉత్తర్వులివ్వగా ఆంధ్రా షుగర్స్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై ఇవాళ వాదనలు జరగ్గా..స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

HC