విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద మిగిలిన స్టైరిన్ మోనోమర్ ఎగుమతికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర కస్టమ్స్ అండ్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ నరేష్ పెనుమాక తెలిపారు. 5554 టన్నుల స్టైరిన్ ఎగుమతికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. విశాఖ అధికారులు ఎగుమతికి వెంటనే అనుమతులు మంజూరు చేశారన్న ఆయన.... పైప్ లైన్ ద్వారా లోడింగ్ ప్రారంభమైందని తెలిపారు. నోర్డ్ మాజిక్ ఓడ ద్వారా స్టైరీన్‌ను దక్షిణ కొరియాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్టైరిన్ మోనోమర్ ఎగుమతికి ఏర్పాట్లు సిద్ధం: కస్టమ్స్ అండ్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ - styrene monomer news
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద మిగిలిన స్టైరిన్ మోనోమర్‌ను నోర్డ్ మాజిక్ ఓడ ద్వారా దక్షిణ కొరియాకు తరలిస్తున్నట్లు రాష్ట్ర కస్టమ్స్ అండ్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ తెలిపారు.
state customs