ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో విమాన సర్వీసులు ప్రారంభం

లాక్ డౌన్ విధింపుతో నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి.

By

Published : May 26, 2020, 10:46 AM IST

Updated : May 26, 2020, 11:02 AM IST

Start of flights in Vishakhapatnam
విశాఖలో విమాన సర్వీసులు ప్రారంభం

విశాఖ విమానాశ్రయంలో విమాన సేవలు మొదలయ్యాయి. విశాఖ నుంచి ఇవాళ 4 విమానాలను నడిపేందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ముందుకొచ్చినట్లు విమానాశ్రయ డైరెక్టరు రాజకిషోర్‌ తెలిపారు.

  • బెంగళూరు - విశాఖ - బెంగళూరు (288) ఉదయం 7.35 గంటలకు విశాఖ నుంచి ఇండిగో విమానం బయల్దేరింది.
  • దిల్లీ - విశాఖ - దిల్లీ (2772) రాత్రి 7.40 గంటలకు ఇండిగో విమానం బయల్దేరుతుంది.
  • హైదరాబాద్‌ - విశాఖ - హైదరాబాద్‌ (742) - మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ నుంచి ఇండిగో విమా నం బయల్దేరుతుంది.
  • బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ ఏషియా విమానం కూడా సిద్ధంగా ఉంది.

ప్రయాణికులందరినీ పరీక్షించి.. శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. థర్మల్ టెస్ట్ చేసి ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించుకున్నాకే.. లోపలికి అనుమతించారు.

Last Updated : May 26, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details