పాఠశాలల్లో మాధ్యమం కన్నా ప్రమాణాలు ముఖ్యమని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. మాధ్యమం ఏదైనా పిల్లలకు చదువు రావడం లేదన్నది వాస్తవమని.... ఇది తాను ఎన్నోఏళ్లుగా చెబుతున్నానని వివరించారు. విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రస్తుత రాజకీయాలపై మీడియాతో ముచ్చటించారు. మాధ్యమం విషయంలో అధికార, ప్రతిపక్ష వాదనలు రెండూ తప్పేనన్నారు. పిల్లలకు చదువు రావాలన్న అంశాన్ని విస్మరించడం మాత్రం దారుణమని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో జరిగే చర్చ నాగరిక సమాజానికి ఒక ప్రతీకగా ఉండాలని జేపీ అన్నారు. ప్రత్యర్థి ఏం చెప్పినా తిరస్కరించడమనే విధానం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అధికారం పొందడం, దానిని కాపాడుకోవడమే లక్ష్యంగా తయారవుతోందన్నారు. కులాలు,మతాలు ప్రాతిపదికన సమాజం విడిపోతే అభివృద్ది అనేదానికి తావే ఉండదన్నారు. గత ప్రభుత్వ ఒప్పందాలను ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించాలని సూచించారు. 'ముందు వాళ్లు ఏం చేసినా తప్పు... నేను చేసిందే ఒప్పు' అని అనుకోవటం సరికాదని అన్నారు. ఈ పద్ధతి ప్రభుత్వ యంత్రాంగాలను, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.
పాఠశాలల్లో మాధ్యమం కన్నా.. ప్రమాణాలు ముఖ్యం: జేపీ - ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
పాఠశాలల్లో మాధ్యమం విషయంలో అధికార, ప్రతిపక్షాల వాదనలు బూటకమని జయప్రకాశ్ నారాయణ అన్నారు. పిల్లల చదువు ఎలా ఉందో పట్టించుకోకుండా మాధ్యమంపై మాట్లాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జయప్రకాశ్ నారాయణ