విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని పలు గ్రామాల్లో సృజనవాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పంచదార, నూనె, గోధుమ పిండి, రవ్వ, చింతపండు, సబ్బులు ఇలా వివిధ రకాల నిత్యావసర వస్తువులను 100 నిరుపేదల కుటుంబాలకు అందించారు.
100 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సృజనవాణి సంస్థ - 100 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సృజనవాణి సంస్థ
దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్రమంలో పలువురు దాతలు ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.

Srujanavani