ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి కార్తికసహస్ర దీపోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు - శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవానికి విశాఖ బీచ్​ రోడ్​లో తితిదే ఏర్పాట్లు

శ్రీవారి కార్తిక సహస్ర దీపోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. విశాఖ బీచ్ రోడ్​లో తితిదే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.15 వరకు కొనసాగుతుంది. శ్రీవారి సంకీర్తనలు, హోమాలు, హారతులతో వుడా పార్క్​ సమీప మైదానం ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.

karthika sahasra deepotsavam arrangements
చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

By

Published : Dec 10, 2020, 10:32 PM IST

విశాఖ బీచ్ రోడ్‌లోని వుడా పార్క్ సమీప మైదానంలో శుక్రవారం జ‌రుగనున్న.. శ్రీ‌వారి కార్తిక స‌హ‌స్ర దీపోత్సవానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భౌతిక‌దూరం పాటిస్తూ 800 మంది మ‌హిళ‌లు దీపాలు వెలిగించేలా స్థలం సిద్ధం చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.15 గంట‌ల వ‌ర‌కు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

వేద‌స్వస్తితో ఆరంభించే ఈ కార్యక్రమంలో.. శ్రీవారి సంకీర్తన గానం, పుణ్యహ‌వ‌చ‌నం, అగ్నిప్రతిష్ఠ, శ్రీ సూక్తహోమం, శ్రీల‌క్ష్మీ చ‌తుర్వింశ‌తి నామావ‌ళితో అర్చన చేస్తారు. అష్టల‌క్ష్మీ స్తోత్ర కూచిపూడి నృత్యం, దీపారాధ‌న‌, సామూహిక దీప‌నీరాజ‌నం, గోవింద‌నామాలు, న‌క్షత్ర కుంభ క‌ర్పూర‌‌ హార‌తులు సమర్పిస్తారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ఇంజినీరింగ్ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేసి.. దీపోత్సవ ఏర్పాట్లు చురుగ్గా పూర్తిచేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details