ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు... - Special trains updates

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

special-trains-for-pongal-festival
special-trains-for-pongal-festival

By

Published : Dec 23, 2019, 11:36 PM IST

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను జత చేసినట్లు రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి రాకేశ్​ తెలిపారు. విశాఖపట్టణం- సికింద్రాబాద్ మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లు విశాఖపట్టణం-సికింద్రాబాద్, విశాఖపట్టణం- తిరుపతి, భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య నడుస్తాయని తెలిపారు. విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య 26 రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. జనవరి 7, 14, 21, 28 తేదీల్లో, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయని వివరించారు.

విశాఖపట్టణం- తిరుపతి మధ్య 26 ప్రత్యేక సర్వీసులను జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపుతామని పేర్కొన్నారు. భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య 25 రైళ్లను జనవరిలో 2, 9, 16, 23, 30 తేదీల్లో.. ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో.. మార్చి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుందని చెప్పారు. సికింద్రాబాద్- భువనేశ్వర్ మధ్య ఒక సువిధ ఎక్స్​ప్రెస్ రైలును జనవరి 10న ఉంటుందని వివరించారు.

కాచిగూడ- శ్రీకాకుళం రోడ్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు, శ్రీకాకుళం రోడ్- తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల, తిరుపతి-కాచిగూడ మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కాచిగూడ- టాటానగర్ మధ్య 25 ప్రత్యేక సర్వీసులు, కాచిగూడ-టాటానగర్ మధ్య ఒక ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్/సికింద్రాబాద్, కాజీపేట్/వరంగల్ వైపు పుష్​పుల్ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.

హైదరాబాద్- కాజీపేట్, వరంగల్- హైదరాబాద్ మధ్య నడిచే పుష్​పుల్ రైలుకు అదనంగా మరో నాలుగు బోగీలను జతచేస్తున్నారు. సికింద్రాబాద్- వరంగల్, మధ్య నడిచే పుష్​పుల్ రైలుకు కూడా నాలుగు అదనపు బోగీలను కలుపుతారు. అదనపు బోగీలు 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఇవీ చూడండి: సమరావతి.. రేపు ఉపరాష్ట్రపతితో అమరావతి రైతుల భేటీ

ABOUT THE AUTHOR

...view details