ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Trains cancelled: విశాఖ నుంచి.. కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులు రద్దు

విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు(Trains cancelled) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ లేమి ఇందుకు కారణమని తెలిపింది.

trains cancelled from vizag
విశాఖ నుంచి.. కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులు రద్దు

By

Published : Jun 3, 2021, 9:51 PM IST

Updated : Jun 3, 2021, 9:58 PM IST

ప్రయాణికుల రద్దీ లేని కారణంగా విశాఖ నుంచి నడుస్తున్న కొన్ని ప్రత్యేక సర్వీసులను రద్దు(Trains cancelled) చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 21 వరకు నడవనున్న రైళ్లు ఈ జాజితాలో ఉన్నాయి.

రద్దయిన రైళ్ల వివరాలు..

  • ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-కాచిగూడ (08561) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 12 నుంచి 21 వరకు కాచిగూడ-విశాఖపట్నం (08562) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-కడప (07488) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 12 నుంచి 21 వరకు కడప-విశాఖపట్నం (07487) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-లింగంపల్లి (02831) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 12 నుంచి 21 వరకు లింగంపల్లి-విశాఖపట్నం (02832) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
Last Updated : Jun 3, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details