ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యూపీఎస్సీ పరీక్షలు రాసే వారి కోసం ప్రత్యేక రైలు - visakha railway latest news

ఈనెల 6న యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం తూర్పుకోస్తా రైల్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలు ఇచ్ఛాపురం నుంచి విజయనగరం మీదుగా విశాఖ చేరుకుంటుందని అధికారులు చెప్పారు. దీనికి రిజర్వేషన్ అవసరం లేదని, జనరల్ టికెట్ చాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి 4,500 మంది పరీక్షలు రాయనున్నారు.

train from Ichhapuram to vizag
పరీక్షలు రాసేవారి కోసం ప్రత్యేక రైలు

By

Published : Sep 4, 2020, 10:56 PM IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నేవల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 6న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యేవారి కోసం.. ప్రత్యేక రైలును తూర్పు కోస్తా రైల్వే నడపనుంది. వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం నుంచి విజయనగరం మీదుగా విశాఖ చేరుకునేలా రైలును ఏర్పాటు చేసినట్లు సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు. ఈ రైలు రేపు సాయంత్రం 5 గంటలకు ఇచ్చాపురంలో ప్రారంభమై 5.40 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుందని, విజయనగరం 7.30 గంటలకు వచ్చి రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

మూడు జిల్లాలకు చెందిన 4,500మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక రైలును నడుపుతున్నామని వివరించారు. ఈ రైలుకు రిజర్వేషన్ అవసరం లేదని సాధారణ టిక్కెట్టు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పరీక్షకు విశాఖలో 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాయనున్నారు. కొవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమయింది. భౌతికదూరం పాటించడం, మాస్కుల వినియోగం వంటి అంశాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయా కేంద్రాల బాధ్యులతో జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details