ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదలకోసం "సివిల్స్" ఫ్యాక్టరీ పెట్టాడు.. ఐఏఎస్​ల ఉత్పత్తే ఇక!! - రోణంకి గోపాల కృష్ణపై ప్రత్యేక కథనం

Rohanki Gopalakrishna: ఒక దీపం మరికొన్ని దీపాలను వెలిగిస్తుంది.. ఒక స్పందించే హృదయం.. మరిన్ని హృదయాలను స్పందించేలా చేస్తుంది.. ఇదిగో ఈ యువకుడూ అదే చేస్తున్నాడు! మారుమూల పల్లె ప్రాంతం నుంచి సివిల్స్ టాపర్‌గా నిలిచిన అతడు.. తన ప్రాంతం నుంచి మరింత మందిని సివిల్స్ ర్యాంకర్లుగా తయారు చేయడానికి పూనుకున్నారు. అయనెవరు? అందుకోసం ఏం చేస్తున్నారు??

Rohanki Gopalakrishna
రోణంకి గోపాల కృష్ణ

By

Published : Mar 30, 2022, 5:06 PM IST

Updated : Mar 30, 2022, 6:49 PM IST

Rohanki Gopalakrishna: అతను సివిల్స్ మూడో ర్యాంకు సాధించాడు..! ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వహించేందుకు తిరిగి తన ప్రాంతానికే వచ్చిన ఆ యువకుడు.. మారుమూల అటవీ ప్రాంతం వారికీ హైదరాబాద్, దిల్లీ తరహాలో కోచింగ్‌ సౌకర్యాలు కల్పించాలని సంకల్పించాడు. సివిల్స్​కు సిద్ధమయ్యే వారికి తనవంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నాడు. అమల్లో పెట్టేశాడు! ఆయనే.. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గకు చెందిన రోణంకి గోపాల కృష్ణ.

సివిల్స్​కు ఉచిత శిక్షణకు తోడ్పడుతున్న రోణంకి గోపాల కృష్ణ

Rohanki Gopalakrishna: సివిల్స్ పరీక్షల్లో దేశంలోనే మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాల కృష్ణ.. తెలుగు మీడియంలోనే పరీక్షలకు సిద్ధమయ్యారు. మొదట్లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ఆయన.. ఆ తర్వాత మరింత కృషి, పట్టుదలతో సివిల్స్ టాపర్​గా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఐటీడీఏ పాడేరు ప్రాజెక్టు అధికారిగా ఉన్న గోపాలకృష్ణ.. స్థానిక గిరిజన యువకుల్లోని ప్రతిభకు సానపెట్టి వారిని ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.

Rohanki Gopalakrishna: ముందుగా గోపాలకృష్ణ సివిల్స్ కోచింగ్‌ కోసం ఫ్యాకల్టీలను సంప్రదించారు. హైదరాబాద్, దిల్లీ వంటి కోచింగ్‌ సెంటర్లలో బోధించే వారినే ఈ కోచింగ్‌కు రప్పించాలని నిర్ణయించారు. ముందుగా 50 మందితో శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించిన గోపాలకృష్ణ.. స్థానిక గిరిజన యువతకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. సివిల్స్ శిక్షణ కోసం మొత్తం 1500 మంది దరఖాస్తు చేశారు. వీరికి విద్యాశాఖ సిబ్బంది సాయంతో రెండు దశల్లో పరీక్షలు నిర్వహించి 128 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇంటర్వ్యూల్లో నెగ్గిన వారికి ఏడాది పాటు ఉచితంగా సివిల్స్ శిక్షణ అందిస్తారు.

Rohanki Gopalakrishna: ఎంపికైన అభ్యర్థులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తామంటున్నారు రోణంకి గోపాలకృష్ణ. గతంలో ఉపాధ్యాయుడిగా పని చేసిన అనుభవం ఉన్న ఈ యువ ఐఏఎస్‌ అధికారి.. ఈ శిక్షణ ద్వారా కనీసం ఒక్క ఐఏఎస్‌ ర్యాంక్‌ అయినా సాధిస్తామని పట్టుదలగా ఉన్నారు.

Rohanki Gopalakrishna: ఎంపిక దశలోని పరీక్షలను సైతం నిజమైన సివిల్స్ పరీక్షల్లా పకడ్బందీగా నిర్వహించారు యువ ఐఏఎస్ రోణంకి గోపాలకృష్ణ. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ డైరెక్టర్ అనంత పద్మరాజు, నన్నయ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్, ఐటీడీఏ పీవోలతో ప్యానల్ ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూల ద్వారా 50 మందిని ఎంపిక చేసి వైజాగ్ వేపగుంట శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: బొగ్గు కొరత లేకుండా చూసుకోండి.. ఏపీ ట్రాన్స్​కోకు సూచన

Last Updated : Mar 30, 2022, 6:49 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details