భాజపా నేతలు విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై భాజపా నేతలు విమర్శలు చేశారు. ప్రధానిని విమర్శించడమే పని అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. విశాఖ ఉత్తర శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. మంత్రి గంటా.. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోతారని విమర్శించారు. ఆయన్ను ఓడించే అవకాశం ఇన్నాళ్లకు తనకు లభించిందని చెప్పారు.
ఈ సారి గంటాపై విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇవీ చదవండి